- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాస్పర్, జయ, మణి.. రెడీ టు డిటెక్ట్
దిశ, ఫీచర్స్ : శునకాలు మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వారి రోజువారీ జీవితంలో ఎన్నో పనుల్లో సాయపడుతూ ది బెస్ట్ అనిపించుకుంటున్నాయి. ఇప్పటికే పేలుడు పదార్థాలు, బాంబులు, ప్రమాదకర రసాయనాలతో పాటు దొంగలను గుర్తించడంలో కుక్కలు అందిస్తున్న సేవల గురించి తెలియంది కాదు. కొన్ని దేశాల్లో క్యాన్సర్ నిర్ధారణ కోసం శునకాలను వినియోగిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో డయాబెటిస్ తదితర వ్యాధుల నిర్ధారణ కోసం కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కుక్కలను వినియోగిస్తుండగా, ఫిన్‌లాండ్‌లోని హెల్సింకీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కరోనా ఉన్న ప్యాసింజర్లను గుర్తించేందుకు నాలుగు శునకాలను ఉపయోగించారు. ఇదే పద్ధతిని మరికొన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి. కాగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ డాగ్స్ కూడా కరోనా వైరస్‌ను డిటెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
కరోనా వైరస్ బాధితుడి శరీరం నుంచి వచ్చే చెమట ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఆ వాసన ఆధారంగానే శునకాలు కరోనా రోగిని గుర్తించగలుగుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో కొవిడ్ 19 బాధితులను గుర్తించడానికి భారత సైన్యం మొదటిసారిగా కుక్కలను ఉపయోగించేందుకు సిద్ధమైంది. కరోనా రోగులు, సాధారణ వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్ జాడను పసిగట్టే సామర్థ్యం కుక్కలకు ఉందో లేదో శిక్షణలో భాగంగా పరీక్షించగా.. తమ శునకాలు ‘కాస్పర్, జయ, మణి’ విజయవంతంగా గుర్తుపట్టాయని ఆర్మీ డాగ్ ట్రైనర్ కల్నల్ సురేందర్ సైని తెలిపారు. కాకర్ స్పానియల్స్, లాబ్రడార్ జాతికి చెందిన కుక్కలతో పాటు మరో 8 కుక్కలు కూడా ఈ తరహా శిక్షణ పొందుతున్నాయని ఆయన వెల్లడించారు.
కాకర్ స్పానియల్ జాతికి చెందిన కాస్పర్ వయసు 2 సంవత్సరాలు కాగా.. తమిళనాడుకు చెందిన ‘జయ, మణి’ చిప్పిపారాయ్ బ్రీడ్స్. ఒక్కో కుక్క గంట వ్యవధిలో 100 నమూనాలను పరీక్షించగలదని, అయితే ప్రతి 15 నిమిషాలకోసారి వాటికి 5 నిమిషాల విరామం ఇవ్వాలని సైని తెలిపారు. ఈ జాగిలాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని అధికారులు అంటున్నారు.