- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో.. భారతదేశ తొలి కలినరీ ఆర్ట్ మ్యూజియం
దిశ, ఫీచర్స్: భారతదేశం సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మ్యూజియాలల్లోని పురాతన వస్తువులు, కళాఖండాలు, అపూరూప చిత్రాలు దేశ వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తాయి. మానవ సంస్కృతి, చరిత్రలను పరిరక్షించే జ్ఞానభాండాగారాలైన మ్యూజియమ్స్ చారిత్రక పరిశోధనలకు ఎంతో ఉపయుక్తంగా ఉండటమే కాకుండా, భావితరాలకు విలువైన పాఠాలు బోధిస్తాయి. వీటి సందర్శనతో విద్యార్థులు విషయ పరిజ్ఞానం నేర్చుకుంటారు. అయితే మనకు ఇండియాలో చరిత్ర, కళలు, యుద్ధ పరికరాలు, వస్తువులు, విమానాలకు అంకితమైన మ్యూజియమ్స్ గురించి మాత్రమే తెలుసు. కానీ భారతదేశానికి ఓ సొంత కలినరీ(పాకశాస్త్రం) ఆర్ట్ మ్యూజియం కూడా ఉందని మీకు తెలుసా? అవును, మీరు సరిగ్గానే విన్నారు. ప్రముఖ చెఫ్ ‘వికాస్ ఖన్నా’ 2018 మణిపాల్‌లో భారతదేశపు తొలి కలినరి ఆర్ట్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ మ్యూజియం తాజాగా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇది స్వాగత్ గ్రూప్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కాలేజ్(WGSHA)లో ఉంటుంది.
‘మేము భారతదేశపు మొదటి మ్యూజియం ఆఫ్ కలినరీ ఆర్ట్స్‌ను ప్రారంభించిన రోజు ఇది. ఈ మ్యూజియాన్ని నాన్నకు అంకితమిస్తున్నాను. భారతదేశం నలుమూలల నుంచి సేకరించిన టూల్స్ (ఉపకరణాలు)- యుటెన్షియల్స్ (పాత్ర)లను సేకరించడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఇండియాలో పోర్చుగీసువారు తయారుచేసిన ప్లేట్లు, హరప్పన్ కాలం నాటి గిన్నెలు, 700 సంవత్సరాల పురాతన ఇనుప పాత్రలు (బావుల నుంచి నీటిని తీయడానికి ఉపయోగిస్తారు), పురాతన వంట సామాగ్రి ఇలా వంద రకాలైన వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపరిచాం. ఇక మణిపాల్‌లోని నా ప్రియమైన డబ్ల్యుజిఎస్‌హెచ్ఏను మించిన మంచి ఇల్లు మరోకటి లేదు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరినందున మీ అందరికీ అభినందనలు. డబ్ల్యుజిఎస్‌హెచ్ఏ ఫ్యాకల్టీ, మాజీ ప్రిన్సిపాల్ పారు జి, ప్రిన్సిపాల్ చెఫ్ తిరు, అండ్ మా విద్యార్థులకు ధన్యవాదాలు’ అని వికాస్ ఖన్నా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.