అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన మహిళల హాకీ టీమ్

by Shyam |
అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన మహిళల హాకీ టీమ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టు అర్జంటీనా పర్యటనకు ఆదివారం బయలుదేరి వెళ్లింది. కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న మహిళల జట్టు గత కొన్ని రోజులుగా బెంగళూరులోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో ప్రాక్టీస్ చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ ఆగిపోవడంతో ఆటగాళ్లు ఫిట్‌నెస్ కోల్పోకుండా తీవ్రమైన సాధన చేశారు. గత ఏడాది పర్యటనలన్నీ రద్దు కావడంతో కొత్త ఏడాదిలో అర్జంటీనా పర్యటనకు వెళ్లారు. రాణీ రాంపాల్ నేతృత్వంలోని హాకీ జట్టు ఈ పర్యటనలో వరల్డ్ నెంబర్ 2 అర్జంటీనాతో నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నది.

జనవరి 26 నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. కాగా, అంతకు ముందు అర్జంటీనా జూనియర్స్, అర్జంటీనా బీ జట్లతో రెండేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. ‘ఏడాది తర్వాత వరల్డ్ టూర్‌కు వెళ్లడం ఆనందంగా ఉన్నది. తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాము. గతంలో కంటే ఇప్పుడు అంతర్జాతీయ వేదికల్లో ఆడటం కొంచెం విభిన్నంగా ఉండే అవకాశం ఉన్నది. అయినా మా శక్తిమేరకు రాణించగలమని నమ్మతున్నాను’ అని కెప్టెన్ రాణీ రాంపాల్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed