రష్యా మిలిటరీ ఎక్సర్సైజ్‌కు భారత త్రివిధ దళాలు..

by Shamantha N |   ( Updated:2020-08-25 07:29:05.0  )
రష్యా మిలిటరీ ఎక్సర్సైజ్‌కు భారత త్రివిధ దళాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత త్రివిధ దళాలు రష్యాకు తరలివెళ్లనున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. రష్యాలో నిర్వహించే మల్టీ లెవల్ కవాజ్‌-2020లో పాల్గొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. దక్షిణ రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రావిన్స్‌లో నిర్వహించే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్‌‌లో చైనా, రష్యా, పాక్ ఇతర దేశాలతో పాటు ఇండియన్ ట్రూప్స్ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.

అంతేకాకుండా, షాంఘై సహకార సంస్థ మరియు మధ్య ఆసియా దేశాల సభ్య దేశాలు పాల్గొంటాయని సమాచారం. అందులో భాగంగానే, సెప్టెంబర్‌లో దక్షిణ రష్యాకు 200 మంది సిబ్బందితో కూడిన భారత త్రివిధ దళాల బృందాలు వెళ్లనున్నాయి. ఆర్మీ నుంచి 160 మంది సిబ్బందితో పాటు, ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన 40 మంది సైనికులు, అక్కడి పరిశీలకుల కోసం ఇద్దరు నేవీ అధికారులు కూడా పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed