- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ సూపర్ లీగ్ జట్లను చూశారా?
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. 2014లో ప్రారంభమైన ఈ సూపర్ లీగ్‌ను అత్యధికంగా ఏటీకే క్లబ్ గెలుచుకున్నది. ఆ జట్టు మూడు సార్లు ఐఎస్ఎల్ నెగ్గగా.. రెండు సార్లు చెన్నియన్ ఒకసారి బెంగళూరు జట్టు గెలుపొందింది. అయితే ఐఎస్ఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నాయి? వాటి యజమానులు ఎవరో ఒకసారి చూద్దాం.
ఐఎస్ఎల్‌లో ఈ సారి 11 జట్లు తలపడబోతున్నాయి. ఈ లీగ్ ప్రారంభంలో కేవలం 6 జట్లు మాత్రమే ఉన్నాయి. కానీ నిర్వాహకులు రానురానూ జట్ల సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఇండియాలో పురాతన క్లబ్స్ అయిన మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్స్ క్లబ్స్ తొలిసారిగా ఈ లీగ్‌లో ఆడబోతున్నాయి.
ఏటీకే మోహన్ బగాన్: కోల్‌కతాలోని ప్రఖ్యాతి గాంచిన మోహన్ బగాన్ జట్టు తొలిసారి ఈ సీజన్‌లో ఐఎస్ఎల్ ఆడబోతున్నది. ఈ జట్టు హోమ్ గ్రౌండ్ సాల్ట్ లేక్ స్టేడియం. మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ నుంచి పెట్టినదే ఈ ఫుట్‌బాల్ క్లబ్ 1889లో ప్రారంభం అయినది. అప్పటి నుంచి క్లబ్ స్థాయిలో పోటీలను గెలిచారు. భారత ఫుట్‌బాల్ జట్టులో ఉన్న ఎంతో మంది ఈ క్లబ్ నుంచి వచ్చిన వాళ్లే. అయితే తొలిసారిగా క్లబ్ ఒక కమర్షియల్ లీగ్‌లో ఆడనున్నది.
బెంగళూరు ఎఫ్‌సీ: బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ జట్టు 2017లో ఐఎస్ఎల్‌లో చేరింది. ఈ క్లబ్ 2013లోనే ప్రారంభం అయినా.. ఐ-లీగ్‌లో చేరడానికి నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గత ఏడాది కప్పు గెలిచి ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్‌గా బెంగళూరు జట్టు బరిలోకి దిగుతున్నది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఈ జట్టును నిర్వహిస్తున్నది.
చెన్నియన్ ఎఫ్‌సీ: ఐఎస్ఎల్ మొదటి నుంచి ఉన్న ఆరు జట్లలో చెన్నియన్ క్లబ్ ఒకటి. ఏటీకే తర్వాత అత్యధిక సార్లు ఈ టైటిల్ గెల్చుకున్న జట్టు చెన్నియన్ మాత్రమే. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పాటు విటా దని ఈ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. గత సీజన్‌లో సరైన ప్రతిభ కనబర్చలేకపోయింది. కానీ అత్యంత బలమైన జట్టుగా ఈ సారి బరిలోకి దిగుతున్నది.
ఈస్ట్ బెంగాల్: కోల్‌కతాకే చెందిన అత్యంత పురాతనమైన స్పోర్ట్స్ క్లబ్ ఇది. మోహన్ బగాన్‌కు ఈ జట్టుకు ఉన్నది కామన్ స్టేడియం. ఐఎస్ఎల్ నిర్వాహకులు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ జట్టు లీగ్‌లో పాల్గొనడానికి ఒప్పుకుంది.
హైదరాబాద్ ఎఫ్‌సీ: హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్‌నే ఐఎస్ఎల్‌లో సరదాగా ది నిజామ్స్ అని పిలుస్తుంటారు. గత సీజన్‌లోనే ఈ జట్టు లీగ్‌లోకి చేరింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో కలసి విజయ్ మద్దూరి, వరుణ్ త్రిపురనేని ఈ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియాన్ని ఈ క్లబ్ తమ హోమ్ గ్రౌండ్‌గా ప్రకటించింది.
గోవా ఎఫ్‌సీ: కరోనా నేపథ్యంలో ఈ సారి మ్యాచ్‌లన్నీ గోవా లోనే జరుగనున్నాయి. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన గోవా ఎఫ్‌సీ ప్రతీ సీజన్‌లోనూ నిరాశ పరుస్తున్నది. అయితే ఈ సారి మ్యాచ్‌లు అన్నీ గొవాలో జరుగుతుండటంతో ఈ జట్టుకు కలసి వచ్చే అవకాశం ఉంది.
జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ: ఐఎస్ఎల్‌లో మూడేళ్ల క్రితం చేరిన జంషెడ్‌పూర్ ఫుట్‌బాల్ క్లబ్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. అయితే గత మూడేళ్లలో ఈ క్లబ్ ప్రదర్శన అంతంత మాత్రమే. టాటా స్టీల్ ఈ క్లబ్‌నునిర్వహిస్తున్నది
కేరళ బ్లాస్టర్స్: ఐఎస్ఎల్‌లో మొదటి నుంచి ఉన్న జట్టు కేరళ బ్లాస్టర్స్. ఎల్లో ఆర్మీ, ది టస్కర్స్ అనే పెట్ నేమ్‌తో అభిమానులు ఈ జట్టును పిలుచుకుంటారు. ప్రసాద్ వి పొట్లూరి ఈ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు.
ముంబయి ఎఫ్‌సీ: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, బిమర్ పరేఖ్ కలసి ముంబయి ఫుట్‌బాల్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. 2014 నుంచి ఈ క్లబ్ మనుగడలో ఉన్నది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఈ జట్టు ఈ సారి కొంత మంది కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగనున్నది.
నార్త్ఈస్ట్ యునైటెడ్: అస్సాం కేంద్రంగా, ఈశాన్య రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఈ నార్త్ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహిస్తున్నారు. లీగ్ ప్రారంభం నుంచి ఈ క్లబ్ మనుగడలో ఉన్నది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ జట్టుకు యజమాని.
ఒడిషా ఎఫ్‌సీ: ఐఎస్ఎల్ ప్రారంభం నుంచి ఉన్న జట్లలో ఒడిషా ఫుట్‌బాల్ క్లబ్ ఒకటి. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియం వేదికగా ఈ జట్టు మ్యాచ్‌లు ఆడుతున్నది. తొలి సీజన్‌లో ఢిల్లీ డైనమోస్ ఫుట్‌బాల్ క్లబ్‌గా ఉన్న ఈ జట్టు.. తర్వాతి సీజన్ నుంచి తమ బేస్‌ను ఒడిషాకు మార్చుకున్నారు.