ఇండియన్ రైల్వేస్‌లో స్క్విడ్ గేమ్

by Shyam |   ( Updated:2021-10-20 08:31:10.0  )
gam,e-12
X

దిశ, ఫీచర్స్: కొరియన్ నెట్‌ఫ్లిక్స్ షో ‘స్క్విడ్ గేమ్’ పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. సోషల్ మీడియా, ఫేమస్ బ్రాండ్స్ అనే కాకుండా ప్రభుత్వ సంస్థలు కూడా జనాలకు అవసరమైన మెసేజ్ అందించేందుకు ఈ షోను ఉపయోగించుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇండియన్ రైల్వేస్ కూడా చేరింది.

ఈ కొరియన్ డ్రామాలో ఒక ఐకానిక్ జెయింట్ డాల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బొమ్మ వరల్డ్ వైడ్‌గా పాపులర్ కావడంతో.. దీనికి క్రియేటివిటీని జోడిస్తున్న నెటిజన్లు రీక్రియేషన్స్‌తోపాటు మీమ్స్ కూడా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్ -19 ప్రోటోకాల్‌ను సీరియస్‌గా పాటించాలని హెచ్చరించేందుకు ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్ ఈ జెయింట్ డాల్‌ను ఉపయోగించుకుంది. ఈ బొమ్మ ముఖానికి మాస్క్ పెట్టిన క్రియేటర్స్.. రెండు వైపులా 2 గేజ్ దూరంలో ఇద్దరు ముసుగు ధరించిన మనుషులు నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘కొవిడ్‌పై గెలుపొందేందుకు మూడు రూల్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ క్యాప్షన్ కిందనే ‘స్క్విడ్ గేమ్’ షోలో గెస్ట్ రోల్ ప్లే చేసిన గాంగ్ యూ.. చేతిలో ‘ఐయామ్ వ్యాక్సినేటెడ్’ అనే ఎన్వలప్‌‌ను చూపిస్తున్న ఫొటోను డిస్‌ప్లే చేసింది. మరో ఫొటోలో కామన్ పీపుల్ వ్యాక్సిన్ కోసం క్యూలో నిలబడి ఉండగా.. చివరి పిక్చర్‌లో లీడ్ యాక్టర్ లీ జంగ్-జే.. చేతిలో శానిటైజర్ బాటిల్‌తో దర్శనమిచ్చాడు.

ఇంతకుముందు ముంబై పోలీసులు కూడా ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు ‘స్క్విడ్ గేమ్’ మీమ్‌ను ఉపయోగించిన విషయం తెలిసిందే. షో గేమ్‌ను ఇండికేట్ చేస్తూ – రెడ్, గ్రీన్ లైట్ నుంచి ఎలిమినేట్ కాకుండా తమను తాము ఎలా కాపాడుకోవాలో సింపుల్ హ్యాక్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed