అమెరికా టు ఆస్ట్రేలియా.. ఎక్కడైనా భారతీయులదే హవా..!

by Anukaran |   ( Updated:2021-07-14 04:21:43.0  )
justin-narayan
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రవాస భారతీయులు విదేశాల్లో అదరగొడుతున్నారు. బతుకుదెరువు కోసం ఫారిన్ కంట్రీస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడినా.. దేశానికి మాత్రం గొప్పకీర్తిని తీసుకొస్తున్నారు. ఒక్క అమెరికాలోనే కాకుండా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న విషయం తెలిసిందే. సమయానుగుణంగా వారి టాలెంట్‌తో ఉన్నత శిఖరాలకు చేరుకుని మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. రెండ్రోజుల కిందట అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతగా పూర్తి చేసుకుని వచ్చిన తెలుగమ్మాయి శిరీష గురించి ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది.

తాజాగా అలాంటి అరుదైన రికార్డునే మరో ప్రవాస భారతీయుడు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే కఠినమైన పోటీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్-2021 టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. మాస్టర్ చెఫ్ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా జరిగినా ఆస్ట్రేలియాలో జరిగే పోటీలకు మాత్రం వరల్డ్ టఫెస్ట్ గేమ్ షోగా పేరుంది. ఇందులో గెలవడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది భారతీయ మూలాలు కలిగిన జస్టిన్ నారాయణ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

జస్టిన్ నారాయణ్ పశ్చిమ ఆస్ట్రేలియాలో స్థిరపడగా.. అక్కడే చర్చి పాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 27ఏళ్ల నారాయణ్ ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్ 13వ సీజన్‌లో పోటీ చేసి ఫైనల్ వరకు చేరుకున్నాడు. ఇతని కంటే ముందే ఫైనల్‌కు చేరుకున్న కిశ్వర్ చౌదరిని, బంగ్లాదేశ్‌కు చెందిన పీట్ కాంప్ బెల్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. మాస్టర్ చెఫ్ -13వ సీజన్ లో విజేతగా నిలిచిన జస్టిన్ నారాయణ్ టైటిట్ ట్రోఫీ అందుకోవడంతో పాటు రివార్డు ప్రైజ్ మనీ AU$250,000 (రూ.1కోటికి పైగా) నగదు బహుమానం అందుకున్నాడు. ఇదిలాఉండగా, 2018లోనూ భారతీయ మూలాలు కలిగిన జైలు అధికారి శశి చెల్లయ్య కూడా ఈ కూకింగ్ షో విజేతగా నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed