యూకేలో కరోనాతో ప్రవాస వైద్యురాలు మృతి

by vinod kumar |

న్యూఢిల్లీ: యూకేలో కరోనాతో దీర్ఘకాలం పోరాడి.. ప్రవాస వైద్యురాలు మృతి చెందారు. కేరళలో పుట్టి ఢిల్లీలో మెడికల్ అర్హతలు పొందిన డాక్టర్ పూర్ణిమ నాయర్ 1997లో యూకేకు వెళ్లి అక్కడే జనరల్ ప్రాక్టీషనర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని స్టేషన్ వ్యూ మెడికల్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పూర్ణిమ దీర్ఘకాలం.. కరోనావైరస్‌తో పోరాడి కన్నుమూశారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టీస్ హాస్పిటల్‌లో మరణించారు. ఆ దేశంలో కరోనాతో ముందుండి పోరాడుతున్న డాక్టర్‌ల కమ్యూనిటీలో పూర్ణిమ మరణంతో మొత్తం పది మంది జనరల్ ప్రాక్టీషనర్‌లు మరణించారని తెలిసింది. అందరి ఆదరాభిమానాలు చూరగొన్న, విలువైన వైద్యురాలు డాక్టర్ పూర్ణిమ నాయర్ మరణించారని తెలుపుతున్నందుకు చింతిస్తున్నామని ఆమె పని చేసిన స్టేషన్ వ్యూ మెడికల్ సెంటర్ ప్రకటించింది. కాగా, పూర్ణిమ నాయర్ పేషెంట్లు సహా.. ఇతర వైద్యులు ఆమె మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపాన్ని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed