కూతుర్ని హత్య చేయడం నా బాధ్యత.. కోర్టులో ఓ తల్లి వింత వాదన

by Sumithra |   ( Updated:2023-04-13 18:10:08.0  )
britan mother news
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికి తెలిసిందే. ప్రపంచం మొత్తం ప్రాణాలను గుప్పింట్లో పెట్టుకొని బతికింది. ఇక కొంతమంది కరోనా తో చనిపోతే మరికొంతమంది కరోనా వస్తుందేమో, కరోనా ఉందేమో అన్న భయంతోనే బలవన్మరణాలకు పాల్పడి ప్రాణాలు విడిచారు. తాజాగా కరోనా భయంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును అతి దారుణంగా చంపిందో తల్లి. బ్రిటన్ లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

భారత్‌కు చెందిన సుధా శివనాదం అనే మహిళకు 2006లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె తన భర్తతోపాటు యూకేలో స్థిరపడ్డారు. వీరికి సాయగిని అనే కూతురు ఉంది. గతేడాది కరోనా బ్రిటన్ ని వణికించింది. ఎక్కడ చూసినా మరణాలు, రోడ్డు మీద శవాలు, ఇక వీటిని చూసిన సుధా భయంతో బెంబేలెత్తిపోయింది. మహమ్మారి గురించి అతిగా ఆలోచిస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ క్రమంలో ఆమె మానసికంగా కుంగిపోయారు. కరోనా వల్ల తన ప్రాణాలు పోవడం తధ్యం అని భావించారు. ఒకవేళ తాను కూడా కరోనాతో చనిపోతే, తన ఐదేళ్ల కుమార్తె సాయగిని ఎవరు చూసుకుంటారన్న భయం ఆమెలోని తల్లి ప్రేమను చంపేసి.. ఉన్మాదిని చేసింది. గతేది జూన్ 30 న కూతురు సాయగిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి చిన్నారిపై కత్తితో దాడిచేసింది. అతి కిరాతకంగా 15 సార్లు చిన్నారిని పొడిచి చంపింది. అనంతరం తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించింది.

రెండు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సుధా భర్త సుఖనాథన్‌ మాట్లాడుతూ.. తాను ఆరోజు పని మీద బయటికి వెళ్లానని, ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్ పై రక్తపు మడుగులో తన కూతురు విగతజీవిగా పడిఉందని తెలిపారు. తన భార్య కరోనా పేరు చెబితేనే భరించలేకపోయేదని, లాక్ డౌన్ ఆంక్షలతో ఆమె మరింత మానసిక సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించాడు. కాగా, ఆమెను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా, తాను హత్య చేయలేదని, బాధ్యత ప్రకారం చేయాల్సింది చేశానని వెల్లడించిందని అన్నాడు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది.

Advertisement

Next Story