- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కఠిన క్వారంటైన్ ప్రారంభించిన టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్ : జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్న టీమ్ ఇండియా పురుష, మహిళ క్రికెటర్లు ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మే 24న క్రికెటర్లు అందరూ కరోనా పరీక్షలు పూర్తిచేసుకొని బయోబబుల్‌లోకి వెళ్లారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా భారత జట్టు క్రికెటర్లు.. హెడ్ కోచ్ రవిశాస్త్రి.. మహిళా జట్టు క్రికెటర్లు అందరూ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇప్పటి వరకు సాధారణ క్వారంటైన్‌లో ఉంటున్న క్రికెటర్లు అందరినీ ఇకపై కఠిన క్వారంటైన్‌లోకి పంపనున్నారు. ఈ ఎనిమిది రోజులు ఏ క్రికెటర్ కూడా బయటకు వెళ్లకుండా కేవలం తమకు కేటాయించిన గదుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లో భారత జట్టకు 10 రోజుల క్వారంటైన్ బదులు కేవలం 3 రోజుల క్వారంటైన్ మాత్రమే ఉండేలా నిబంధనలు మార్చారు. ఇందుకోసం భారత జట్టు ముందుగానే కఠిన క్వారంటైన్‌లో ఉండనున్నది. జూన్ 2న భారత మహిళ, పురుష జట్లు ఫ్లైట్ ఎక్కక ముందు మరోసారి కరోనా పరీక్షలు చేసుకోనున్నాయి.