జమ్మూకాశ్మీర్‌పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు

by Shamantha N |
జమ్మూకాశ్మీర్‌పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పొరుగు దేశం చైనా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. గాల్వాన్ వ్యాలీ ఘటన ఇంకా కొలిక్కిరాలేదు. ఇరు దేశాలకు చెందిన బలగాల ఉపసంహరణకు ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జమ్మూకాశ్మీర్ అంశంపై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

గతేడాది ఆగస్టు 5వ తేదీన జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370 అధికరణ 35A ను కేంద్రం రద్దు చేసింది. బుధవారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.

జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన చట్ట విరుద్ధమని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. భారత్ , పాకిస్తాన్ మధ్య మిగిలిన చారిత్రక వివాదం అని పేర్కొన్నారు. ఇటు చైనా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఖండించింది. అంతేకాకండా తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని డ్రాగన్ కంట్రీకి హితవు పలికింది.

Advertisement

Next Story