గ్రౌండ్‌లో ప్రపోజ్ చేసిన ప్రియుడు

by Anukaran |   ( Updated:2020-11-29 06:22:37.0  )
గ్రౌండ్‌లో ప్రపోజ్ చేసిన ప్రియుడు
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాలోని సిడ్ని క్రికెట్ గ్రౌండ్ పలు సంఘటనలకు వేదికగా నిలుస్తున్నది. తొలి వన్డే సందర్భంగా ఇద్దరు యువకులు అదానీకి వ్యతిరేకంగా నిరసనలు చేయగా.. ఆదివారం రెండో వన్డే సందర్బంగా మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. గ్యాలరీల్లో ఉన్న ఒక భారతీయ యువకుడు తన ఆస్ట్రేలియా ప్రేయసికి మ్యాచ్ జరుగుతుండగానే ఉంగరం ఇచ్చి పెళ్లి ప్రపోజల్ చేయగా.. దానికి ఆ ప్రేయసి వెంటనే ఒప్పుకున్నది. ఈ తతంగమంతా టీవీ కెమెరాలు చిత్రీకరించాయి. అంతే కాకుండా పక్కన ఉన్న ప్రేక్షకులు కూడా చప్పట్లు కొడుతూ.. తమ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు. ఇక గ్రౌండ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ కూడా ఈ దృశ్యాన్ని చూసి చప్పట్లు కొట్టి ఆ జంటను అభినందించాడు. ఈ వీడియో ను ఫాక్స్ టీవీ తమ ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed