ఈ ఏడాది ఆర్థికవ్యవస్థ కోలుకుంటుంది : ఎస్‌బీఐ ఛైర్మన్

by Harish |   ( Updated:2021-06-27 06:10:13.0  )
business news
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా మరోసారి వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికవ్యవస్థ కోలుకుంటుందని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఆశాభావం వ్యక్తం చేశారు. గతేదాది మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ 3.3 శాతం కుదించుకుపోవడమే కాకుండా గణనీయ స్థాయిలో ప్రాణ నష్టం, జీవనోపాధి దెబ్బతిన్నట్టు ఆయన తెలిపారు. బ్యాంకు 66వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన.. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 7.3 శాతానికి పరిమితమైందన్నారు. అయితే, క్లిష్ట సమయాల్లో విధాన చర్యలు, ఆర్‌బీఐ, కేంద్రం సమన్వయ ప్రయత్నాలు మెరుగైన వృద్ధిని సాధించేందుకు దోహదం చేశాయని పేర్కొన్నారు.

సెకెండ్ వేవ్ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. గతేడాది నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఎస్‌బీఐ మెరుగైన పనితీరును కలిగి ఉంది. పరిమిత కార్యకలాపాలు కొనసాగిస్తూనే వినియోగదారులకు సేవలందించినట్టు దినేష్ ఖారా చెప్పారు. ప్రస్తుత ఏడాదిలో ఎస్‌బీఐ తన డిజిటల్ వ్యాపారాన్ని మరింత వేగవంతంగా కొనసాగిస్తుందని, యోనో కార్యకలాపాల పరిధిని విస్తరించనున్నట్టు ఆయన వివరించారు.

Advertisement

Next Story