- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రికవరీలో భారత్ : ఎస్అండ్‌పీ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా వ్యవసాయ రంగంలో మెరుగైన పరిస్థితులు, కరోనా కేసుల నియంత్రణ, ప్రభుత్వం వ్యయం పెరగడం వంటి కారణాలు ఆర్థికవ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్అండ్‌పీ మంగళవారం తెలిపింది. ఇవి మాత్రమే కాకుండా మరిన్ని అంశాల్లో భారత్ కోలుకోవాల్సి ఉందని ఎస్అండ్‌పీ అభిప్రాయపడింది. ఊహించని స్థాయిలో ఖర్చు ప్రతిపాదనల నేపథ్యంలో 2021-బడ్జెట్ సైతం రికవరీకి దోహదం చేస్తుందని పేర్కొంది. ‘స్థిరత్వం నుంచి రికవరీకి మారుతున్న క్రమంలో ఆర్థికవ్యవస్థ ముందు ఇప్పటికీ ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయి.
భారత్ కరోనా పూర్వస్థాయికి చేరుకోలేని విధంగా ఉత్పత్తి నష్టాలను ఎదుర్కొంటోందని అంచనా వేస్తున్నాము. దీర్ఘకాలంలో ఇది జీడీపీలో 10 శాతానికి సమానమైన ఉత్పత్తిని సూచిస్తుందని అంచనా వేస్తున్నట్టు’ ఎస్అండ్‌పీ వెల్లడించింది. భారత ఆర్థికవ్యవస్థ 2021-22లో రికవరీ వైపుగా పయనిస్తుంది. దీనికి ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, వినియోగంలో డిమాండ్ అంశాలు దోహదపడుతున్నాయి. అదేవిధంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ 2023 నాటికి మెరుగుపడే అవకాశాలున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 శాతం పునరుద్ధరణను సాధించవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు కరోనా ప్రభావాలను ఎదుర్కొనేనుదుకు మూలధనాన్ని, నిల్వలను పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని ఎస్అండ్‌పీ వెల్లడించింది.