- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోబోటిక్ సర్జరీతో లైఫ్ సేవ్.. ఇద్దరి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు
దిశ, ఫీచర్స్ : 3D ఇమేజింగ్, రోబోటిక్స్ ప్రొసీజర్ ఉపయోగిస్తూ, వెన్నెముక వైకల్యాల(స్పైనల్ డీఫార్మిటీస్)తో బాధపడుతున్న ఇద్దరు టీనేజ్ అమ్మాయిల ప్రాణాలు కాపాడారు ఇండియన్ డాక్టర్లు. ఈ విషయాన్ని ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరీస్ సెంటర్ (ISIC) బుధవారం ప్రకటించింది. అత్యంత అధునాతన రోబోటిక్స్ శస్త్రచికిత్సా ప్రక్రియగా పరిగణించబడే ఈ ‘MAZOR X స్టీల్త్ ఎడిషన్’.. ఆర్థోపెడిక్, న్యూరోలాజికల్, వెన్నెముక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందన్నారు. దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు భారతీయ వైద్యులు MAZOR Xతో ‘O-Arm’ అనే 3D ఇమేజింగ్ వ్యవస్థను ఇంటిగ్రేట్ చేయగా, దేశంలోనే ఇది మొదటి ఆస్పత్రిగా మారింది.
సాంకేతికత ఎలా కాపాడింది?
13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు తీవ్రమైన వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారు. 13 ఏళ్ల అమ్మాయికి థొరాసిక్ స్కాలియోసిన్(పార్శ్వగూని) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనివల్ల తను 85 డిగ్రీల మేర వంగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 16 ఏళ్ల అమ్మాయికి 2018లో వెన్నెముక క్షయ ఉన్నట్లు కన్‌ఫర్మ్ కాగా, అప్పటినుంచి ఆమె నడవడానికి ఇబ్బంది పడేది. కాగా శస్త్రచికిత్సల సమయంలో చొప్పించిన స్క్రూస్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో రోబోటిక్స్, 3డి ఇమేజింగ్ కాంబినేషన్ సాయపడిందని ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సమయంలో సాధారణంగా తలెత్తే ‘పక్షవాతం, రేడియేషన్ ఎక్స్‌పోజర్, రక్తస్రావం, ఆపరేషన్ అనంతరం నొప్పి’ వంటి ప్రమాదాలను తొలగించడంలో రోబోటిక్ ప్రక్రియ సహాయపడింది. నిజానికి వెన్నెముక ప్రాంతంలో సర్జరీ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని నాడీ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. కోత విధించడంలో ఏ మాత్రం తప్పు జరిగినా అది రోగి శరీర భాగాలన్నింటిపై ప్రభావం చూపుతుంది. అటువంటి మానవ తప్పిదాల ప్రమాదాన్ని ఈ ప్రక్రియ తగ్గించనున్నట్లు కనిపిస్తోంది.
అంతేకాదు! సాంకేతికత.. బాలికలకు మరింత నష్టం కలిగించే ప్రమాదాన్ని నిరోధించడమే కాకుండా శస్త్రచికిత్స పురోగతిని డాక్టర్లు లైవ్‌లో పర్యవేక్షించేందుకు సహాయపడింది. శస్త్ర చికిత్సను అంచనా వేయడానికి, అవసరమైతే కోర్సును సరిచేయడానికి మొబైల్ వ్యూ స్టేషన్‌లో ప్రసారం చేయబడింది. కాగా ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో వైద్యుల జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాలేదు.