కుక్క అస్థికలు కలపడానికి ఇండియాకు…

by Shyam |
కుక్క అస్థికలు కలపడానికి ఇండియాకు…
X

దేశ గొప్పతనం అనేది జంతువుల్ని చూసే విధానంలోనే ఉంటుందని మహాత్మగాంధీ చెప్పిన మాటలను న్యూజిలాండ్‌లో నివసించే ప్రమోద్ కుమార్ నిరూపించాడు. తను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోతే దాని అస్థికలు గంగా నదిలో కలపడానికి న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వచ్చేశాడు.

బిహార్‌లోని పునియా జిల్లాకు చెందిన ప్రమోద్, గత 40 ఏళ్లుగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో నివసిస్తున్నాడు. లైఖన్ అని పేరు పెట్టుకుని ఓ కుక్కను పదేళ్లకు పైగా పెంచుకున్నాడు. దురదృష్టవశాత్తు లైఖన్ చనిపోయింది. అక్కడే ఆక్లాండ్‌లో దాని అంత్యక్రియలను హిందూ సంప్రదాయ పద్ధతిలో పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు లైఖన్ అస్థికలను గంగలో కలపడానికి గయాకు వచ్చాడు. అలాగే అక్కడ పిండప్రదానం కూడా చేశాడు.

Advertisement

Next Story

Most Viewed