- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో పరిశ్రమ వృద్ధికి 2021-22వరకు ఆగాల్సిందే : నోమురా!
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 మహమ్మారి వల్ల వినాశకర ప్రభావాల నుంచి కోలుకున్న తర్వాత భారత ఆటో పరిశ్రమ 2021-22 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని కనబరుస్తుందని, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు, ముఖ్యంగా టూ-వీలర్ వాహనాల అమ్మకాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని నోమురా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్స్ ఇండియా తెలిపింది. అయితే, వ్యక్తిగత వాహనాల విభాగంలో 2018-19 స్థాయిలకు చేరుకునేందుకు 2022-23 నాటికి మాత్రమే వీలవుతుందని పేర్కొంది. 2018-19లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2.7 శాతం పెరిగి రూ. 33,77,436 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ తెలిపింది.
కరోనా లాంటి అత్యంత దారుణ సంక్షోభం తర్వాత ఆటో పరిశ్రమ బలమైన వృద్ధిని సాధించేందుకు 2021-22 వరకు వేచి ఉండక తప్పదని ఎన్ఆర్ఐ కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్స్ ఇండియా గ్రూప్ హెడ్ అశిమ్ శర్మ చెప్పారు. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో కొన్ని వాహనాల ధరలు కూడా పెరగడమే ఈ ఆలస్యానికి కారణమని ఆయన స్పష్టం చేశారు. 2021-22లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అధిక సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా ఓలా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలోకి రావడంతో టూ-వీలర్ అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయని అశిమ్ చెప్పారు. అదేవిధంగా, ఎలక్ట్రిక్ వాహనాలు పెరగనున్న నేపథ్యంలో లిథియం టైటానియం ఆక్సైడ్ బ్యాటరీల వంటి అత్యాధునిక సాంకేతిక సహకారం ఉన్నందున దేశీయంగా సెల్ తయారీ పరిశ్రమ మెరుగవుతుందని పేర్కొన్నారు.