లాక్‌డౌన్ లేకుంటే 2లక్షల కేసులుండేవి : హెల్త్ మినిస్ట్రీ

by  |

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో లేకుంటే ఇప్పటికి సుమారు రెండు లక్షల కరోనా కేసులు నమోదయ్యేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్ 19 పై పోరుకు లాక్‌డౌన్, కట్టడి చర్యలు అత్యంత కీలకమైనవని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒక లక్ష ఐసొలేషన్ బెడ్లు అందుబాలటులో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ 19 పేషెంట్ల కోసం 11,500 ఐసీయూ పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కాగా, కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా 586 ఆస్పత్రులున్నాయని వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా కరనా కేసుల సంఖ్య 7,447కు చేరింది. 642 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా.. 239 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,035 కేసులు కొత్తగా రిపోర్ట్ కాగా, 40 కరోనా మరణాలు సంభవించాయి.

Tags: health ministry, lav agarwal, lockdown, cases, deaths, country

Advertisement

Next Story

Most Viewed