- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో టీ20 టీమిండియాదే
దిశ, స్పోర్ట్స్: వరుసగా రెండు డకౌట్లు.. కెప్టెన్‌గా డకౌట్ల రికార్డు. తొలి మ్యాచ్‌లో రోహిత్‌ను తప్పించి విమర్శలు.. ఒక జాతీయ జట్టు కెప్టెన్‌కు ఇంత కంటే అవమానం ఏముంటుంది. కానీ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ విమర్శలకు సమాధానం ఇచ్చాడు. పరుగుల యంత్రం ఆగిందని ఆరోపించిన వారికి అదరగొట్టే ఇన్నింగ్స్ చూపించాడు. జట్టు ఎంపికతోనే అందరినీ ఆశ్చర్యపరిచిన విరాట్ కోహ్లీ.. అటు కెప్టెన్‌గా ఇటు బ్యాట్స్‌మాన్‌గా అందరికీ సమాధనం ఇచ్చేశాడు. రెండో టీ20లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించి సిరీస్‌ను 1-1గా సమానం చేశాడు.
పేటీఎం టీ20 సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇండియా జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించలేదు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంక్ కలిగిన కేఎల్ రాహుల్(0) తొలి ఓవర్‌లోనే అవుటయ్యాడు. ఇక అరంగేట్రం ఓపెనర్ ఇషాన్ కిషన్, కెప్టెన్ కోహ్లీ కలసి టీమ్ ఇండియాను నడిపించారు. గత కొన్ని సిరీస్‌లుగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ తొలి సారిగా పాజిటివ్ గేమ్ ఆడాడు. ఒకవైపు ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లో ఆడిన విధంగానే బౌండరీలు, సిక్సులతో దూకుడుగా ఆడాడు. కేవలం 32 బంతుల్లో 56 పరుగులు చేశాడు. విరాట్, కిషన్ కలసి రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించాడు. అయితే రషీద్ బౌలింగ్‌లో కిషన్ (56) ఎల్బీగా ఔటయ్యాడు. ఇక ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ (26) దూకుడుగా ఆడాడు. పంత్ సపోర్ట్‌తో కోహ్లీ కూడా తన దూకుడును కొనసాగించాడు. వీరిద్దరూ కలసి మరో 36 పరుగులు జోడించారు. కాగా, కోహ్లీ చాలా రోజుల తర్వాత టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్‌తో కలసి కోహ్లీ మ్యాచ్‌ను ముగించాడు. ఇండియా కేవలం 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 166 పరుగుల చేసింది. రెండో టీ20లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.
భువీ స్టార్ చేస్తే.. ఠాకూర్ కంప్లీట్ చేశాడు..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లు విఫలం చెందారు. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకరమైన జాస్ బట్లర్ (0)ను ఎల్బీడబ్ల్యూ చేయడంతో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత జేసన్ రాయ్, డేవిడ్ మలన్ కలసి జట్టు స్కోర్‌ను పరుగెత్తించారు. ప్రతీ బౌలర్‌ను చితకబాదుతూ పరుగుల వేగం పెంచారు. అయితే ప్రపంచ నెంబర్ వన్ టీ 20 బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్ (24) యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జేసన్ రాయ్ (46)తొ కలసి జానీ బెయిర్‌స్టో దూకుడును కొనసాగించాడు. తొలి టీ20లో ఒక పరుగు తేడాతో అర్దసెంచరీ కోల్పోయిన రాయ్.. ఈ మ్యాచ్‌లో 46 పరుగుల వద్ద అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించగా భువనేశ్వర్ కుమార్ ఏ మాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (20), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (28), బెన్ స్టోక్స్ (24) భారీ స్కోర్ కోసం ప్రయత్నించారు. అయితే చివర్లో భారత పేసర్లు పరుగులు రాకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ వికెట్లు తీయడమే కాకుండా పరుగుల కూడా రాకుండా అడ్డుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరి 2 వికెట్లు తీయగా.. భువీ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు
జేసన్ రాయ్ (సి) భువనేశ్వర్ కుమార్ (బి) వాషింగ్టన్ కుమార్ 46, జాస్ బట్లర్ (ఎల్బీడబ్ల్యూ)(బి) భువనేశ్వర్ కుమార్ 0, డేవిడ్ మలన్ (ఎల్బీడబ్ల్యూ)(బి) యజువేంద్ర చాహల్ 24, జానీ బెయిర్‌స్టో (సి) సూర్యుమార్ యాదవ్ (బి) వాషింగ్టన్ సుందర్ 20, ఇయాన్ మోర్గాన్ (సి) రిషబ్ పంత్ (బి) శార్దుల్ ఠాకూర్ 28, బెన్ స్టోక్స్ (సి) హార్దిక్ పాండ్యా (బి) శార్దుల్ ఠాకూర్ 24, శామ్ కర్రన్ 6 నాటౌట్, క్రిస్ జోర్డాన్ 0 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లు) 164/6
వికెట్లు పతనం : -1, 2-64, 3-91, 4-119, 5-142, 6-160
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ (4-0-28-1), వాషింగ్టన్ సుందర్ (4-0-29-2), శార్దుల్ ఠాకూర్ (4-0-29-2), హార్దిక్ పాండ్యా (4-0-33-0), యజువేంద్ర చాహల్ (4-0-34-1)
ఇండియా
కేఎల్ రాహుల్ (సి) జాస్ బట్లర్ (బి) శామ్ కర్రన్ 0, ఇషాన్ కిషన్ (ఎల్బీడబ్ల్యూ)(బి) ఆదిల్ రషీద్ 56, విరాట్ కోహ్లీ 73 నాటౌట్, రిషబ్ పంత్ (సి) జానీ బెయిర్‌స్టో (బి) క్రిస్ జోర్డాన్ 26, శ్రేయస్ అయ్యర్ 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.5 ఓవర్లు) 166/3
వికెట్ల పతనం: 1-0, 2-94, 3-130
బౌలింగ్ : శామ్ కర్రన్ (4-1-22-1), జోఫ్రా ఆర్చర్ (4-0-22-0), క్రిస్ జోర్డన్ (2.5-0-32-1), టామ్ కర్రన్ (2-0-26-0), బెన్ స్టోక్స్ (1-0-17-0), ఆదిల్ రషీద్ (4-0-38-1)