లార్డ్స్ వేదికగా టీమిండియా విక్టరీ..

by Anukaran |   ( Updated:2021-08-16 12:14:40.0  )
cricket
X

దిశ, వెబ్‌డెస్క్: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అతిథ్య జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా ఓపెనర్లను కోల్పోయింది. ఇదే క్రమంలో భారత బౌలర్లు, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్లపై ఒత్తిడి తీసుకువచ్చి వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో 120 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీసుకున్నారు.

Advertisement

Next Story