- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియా అద్భుత విజయం.. చేజేతులా ఓడిన టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా మహిళా జట్టు గెలవాల్సిన మ్యాచ్ చేజేతులా పోగొట్టుకున్నది. రెండో వన్డేలో చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. కానీ ఆఖరి ఓవర్ వేసిన సీనియర్ పేసర్ జులన్ గోస్వామి చేసిన తప్పులు జట్టు ఓటమికి కారణమయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెకాయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసి 94 బంతుల్లో 86 పరుగులు చేసింది. స్మృతి మంధాన, షెఫాలి వర్మ కలసి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. స్మృతి మంధాన ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోవడంతో షెఫాలీకి ఎక్కువ బంతులు ఆడే అకాశం రాలేదు.
ఈ క్రమంలో షెఫాలి వర్మ (22) మోలినెక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (8), యాస్తిక భాటియా (3) నిరాశ పరిచారు. అయితే స్మృతి మంధానతో కలసి రిచా ఘోష్ మరో మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరచింది. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. తహీలా మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో స్మృతి మంధాన (86) మూనీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. రీచా ఘోష్ (44), దీప్తి శర్మ (23), పూజా వస్త్రాకర్ (29)తో పాటు చివర్లో జులన్ గోస్వామి (28) రాణించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఏకంగా 31 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం. తహిలా మెక్‌గ్రాత్ 3, సోఫీ మోలినెక్స్ 2 వికెట్లు తీయగా డ్రేసీ బ్రౌన్‌కు ఒక వికెట్ లభించింది.
ఇక 275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు తొలి ఓవర్‌లోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది, ఓపెన్ అలీసా హీలీ (0) జులన్ గోస్వామి బౌలింగ్‌లో డకౌట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన మెగ్ లాన్నింగ్ (6), ఎలీస్ పెర్రీ (2), ఆష్లీ గార్డెనర్ (12) పూర్తిగా నిరాశ పరచడంతో ఆస్ట్రేలియా జట్టు 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్ బెత్ మూనీ, తహిలా మెక్‌గ్రాత్‌తో కలసి భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఇద్దరూ కలసి బారత బౌలర్లను సమర్ద వంతంగా ఎదుర్కున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను అవుట్ చేయడానికి కెప్టెన్ మిథాలీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. వీరిద్దరూ కలసి 5వ వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే తహిల మెక్‌గ్రాత్ (74) అవుటైన తర్వాత బెత్ మూనీ, నికోలా కేరీ కలసి మరో చక్కని ఇన్నింగ్స్ ఆడారు, చివరి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడింది.
చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండటంతో భారత్ జట్టు గెలుస్తుందని అందరూ భావించారు. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా జులన్ గోస్వామి రెండు నోబాల్స్ వేయడంతో ఆస్ట్రేలియా గెలిచింది. చివరి ఓవర్ 6వ బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా నికోలా కేరీ భారీ షాట్ కొట్టగా మిడ్ వికెట్‌లో క్యాచ్ పట్టారు. భారత మహిళల సంబరాలు చేసుకున్నారు. అయితే థర్డ్ అంపైర్ అది నోబాల్‌గా ప్రకటించారు. దీంతో మరో బంతి ఫ్రీ హిట్ వచ్చింది. దానికి ఆస్ట్రేలియా జట్టు రెండు పరుగులు చేసి విజయం సాధించింది. చివరి వరకు క్రీజ్‌లో ఉండి సెంచరీ సాధించిన బెత్ మూనీ (125)కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోర్ బోర్డు :
ఇండియా 274/7
ఆస్ట్రేలియా 275/5