చెన్నై చేరుకున్న బెన్ స్టోక్స్

by Shyam |
చెన్నై చేరుకున్న బెన్ స్టోక్స్
X

చెన్నై: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌ రౌండర్ బెన్ స్టోక్స్ ఆదివారం చెన్నై చేరుకున్నాడు. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్-ఇండియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెన్ స్టోక్స్‌తోపాటు మరికొందరు ఇంగ్లీష్ ఆటగాళ్లు చెన్నై చేరుకుని లీలా మహల్ హోటల్‌ల్లో క్వారంటైన్‌కు వెళ్లారు. మిగతా జట్టు సభ్యులు శ్రీలంక పర్యటనలో ఉన్నారు.

వారు బుధవారం చెన్నై చేరుకోనున్నారు. కాగా, భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య 4 టెస్టులు, 5టీ20, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభ కానున్నాయి. 3, 4వ టెస్టులతోపాటు, టీ20 సిరీస్ అహ్మదాబాద్ వేదికగా, వన్డే సిరీస్ పూణె వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ బయోబబుల్‌ వాతావరణంలో నిర్వహించనున్నారు.

Advertisement

Next Story