- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు రెండో టీ20.. సిరీస్‌పై భారత్ గురి
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నేడు భారత జట్టు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు సిడ్నీ వేదికగా జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌పై కన్నేసింది. వరుసగా పది మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేని టీమిండియా.. తాజాగా రెండో టీ20లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోసారి ఆల్‌రౌండ్ షోతో సిరీసను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణిస్తున్న రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమవడం తీవ్రమైన లోటని చెప్పొచ్చు. అద్భుత ఫామ్‌లో ఉన్న జడ్డు స్థానం భర్తీ చేయలేనిది.
అంతేగాకుండా ఇప్పటికే వన్డే సిరీస్ నెగ్గి ఊపుమీద ఉన్న ఆసీస్ జట్టు టీ20 సిరీస్‌ను కూడా కేవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆసీస్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. వార్నర్, అగర్, స్టొయినిస్‌లు ఈ సిరీస్‌కు దూరం కాగా, తాజాగా కెప్టెన్ ఫించ్ కూడా జత చేరాడు. మొదటి మ్యాచ్‌లో అతడు నడుము నొప్పితో బాధపడ్డాడు. దీంతో మాథ్యూ వేడ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారం మొత్తం ఫుల్ ఫామ్‌లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, విధ్వంసక ఆటగాడు మ్యాక్స్‌వెల్ పైనే ఉంటుంది.