రేడియోలో ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారం

by Shyam |
రేడియోలో ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారం
X

దిశ, స్పోర్ట్స్: ఆలిండియా రేడియో తమ శ్రోతలకు శుభవార్త చెప్పింది. త్వరలో ప్రారంభం కానున్న ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌కు సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని రేడియోలో ప్రసారం చేయనున్నట్లు ఒకప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్‌కు కూడా రేడియో వ్యాఖ్యానం అందించే హక్కులు ఇవ్వాలని బీసీసీఐని ప్రసారభారతి కోరింది. కానీ ఆ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగనున్న 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులకు సంబంధించిన హక్కులను ప్రసార భారతి దక్కించుకున్నది.

క్రికెట్ ఆస్ట్రేలియా, సోనీ పిక్చర్స్‌కు మధ్య క్రికెట్ హక్కుల ఒప్పందం ఉన్నది. భారత ఉపఖండంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన హోం గ్రౌండ్ మ్యాచ్‌లను సోనీనే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. దీంతో రేడియో వ్యాఖ్యానానికి సంబంధించిన హక్కులను సోనీ పిక్చర్స్.. ఆలిండియా రేడియోకు కట్టబెట్టింది. దీంతో పాటు బ్రాడ్‌కాస్ట్ యాక్ట్ ప్రకారం వన్డే, టీ20 మ్యాచ్‌ల ఫీడ్‌ను సోనీ పిక్చర్స్ దూరదర్శన్‌తో పంచుకోనున్నది.

Advertisement

Next Story