- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీమిండియా సౌతాఫ్రికా పర్యటన యథాతథం
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నది. షెడ్యూల్ ప్రకారం న్యూజీలాండ్‌తో రెండో టెస్టు ముగిసిన అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికా వెళ్లి 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాపిస్తున్నది. దీంతో విమానాల ప్రయాణాలపై ఆంక్షలు కూడా విధించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి.
దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ స్పందించారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేవని షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఆయన చెప్పారు. క్రికెట్ సౌత్ఆఫ్రికా కఠినమైన బయోబబుల్ ఏర్పాటు చేసి ఆటగాళ్లకు తగిన రక్షణ కల్పిస్తామని భరోసా కలిగించిందని.. దీంతో ఆ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ఆయన చెప్పారు. అయితే భారత ప్రభుత్వం కనుక ఆటగాళ్లను పంపకూడదని ఆదేశిస్తే మాత్రం పర్యటన రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మరోవైపు ఇప్పటికే ఇండియా ‘ఏ’ జట్టు దక్షిణాఫ్రికాలో ఉన్నది. బ్లూమ్‌ఫౌంటైన్ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఏ’ తో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడింది. ఆటగాళ్ల రక్షణకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ చెప్పింది.