- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వ్యాక్సిన్ పంపిణీలో తొలి ప్రాధాన్యత భారత్‌కే'
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19ను నివారించేందుకు ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ను మొదట భారత్‌లోనే సరఫరా చేసేందుకు దృష్టి సారిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా హామీ ఇచ్చారు. దీనికోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, వ్యాక్సిన్ కొనేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ వ్యాక్సిన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
తాజాగా ఈ వ్యాక్సిన్ 90 శాతం మెరుగైన ఫలితాలను అందించినట్టు ఆస్ట్రాజెనెకా ప్రకటించిన తరుణంలో దీని సరఫారాపై ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది ముగిసేలోపు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసరం పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతి లభించవచ్చని, అనంతరం 2021 ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో పూర్తిస్థాయి అనుమతులు రావొచ్చని అదర్ పూనావాలా అభిప్రాయపడ్డారు. కాగా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొందరగా అనుమతి లభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు, అదేవిధంగా డబ్ల్యూహెచ్‌వోకు దరఖాస్తు చేసి తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు వ్యాక్సిన్‌ను అందించాలని భావిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.