రెండు దశాబ్దాల్లో ఇంధన డిమాండ్‌లో భారత్‌దే అత్యధిక వాటా

by Harish |
రెండు దశాబ్దాల్లో ఇంధన డిమాండ్‌లో భారత్‌దే అత్యధిక వాటా
X

దిశ, వెబ్‌డెస్క్: 2030 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా యూరోపియన్ యూనియన్‌ను భారత్ అధిగమిస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) మంగళవారం తెలిపింది. రానున్న రెండు దశాబ్దాల్లో ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ అత్యధిక వాటా కలిగి ఉంటుందని ఐఈఏ అంచనా వేసింది. ఐఈఏ వెలువరించిన ఇండియా ఎనర్జీ ఔట్‌లుక్-2021లో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 2040 నాటికి 8.6 ట్రిలియ డాలర్లకు విస్తరించడంతో ప్రాథమిక ఇంధన వినియోగం దాదాపు 1,123 మిలియన్ టన్నుల చమురుతో రెట్టింపు అవ్వొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత్మ చైనా, అమెరికా, యూరప్ తర్వాత భారత్ నాలుగో అతిపెద్ద ప్రపంచ ఇంధన వినియోగదారుగా ఉంది.

‘2040 నాటికి ప్రపంచ ఆర్థికవ్యవస్థకు జపాన్‌తో సమానమైన జీడీపీ వృద్ధి రేటును కలిగి ఉంటుందని, 2030 సమయానికి యూరోపియన్ యూనియన్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది. 2019-20 నుంచి ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ దాదాపు నాలుగింట ఒక వంతు కలిగి ఉంది. ఇది అన్ని దేశాల కంటే పెద్దది. తలసరి సొంత కార్ల వినియోగం ఐదు రెట్లు పెరుగుదలతో భారత్ చమురు డిమాండ్ వృద్ధికి దారితీస్తుంది. అలాగే, సహజవాయువు కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉండనుంది. 2040 నాటికి ఇది మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ కలిగి ఉంటుందని ఐఈఏ ఔట్‌లుక్ వెల్లడించింది. కరోనా మహమ్మారికి ముందు 2019-2030 మధ్య భారత ఇంధన డిమాండ్ దాదాపు 50 శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది. అయితే, ప్రస్తుతం ఇది 35 శాతంగా ఉంది. ‘విస్తరిస్తున్న ఆర్థికవ్యవస్థ, జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భారత్ మిగిలిన అన్ని దేశాల కంటే ఇంధన డిమాండ్‌లో అత్యధిక పెరుగుదలను చూస్తుందని’ ఐఈఏ వెల్లడించింది.

Advertisement

Next Story