- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షీణించిన భద్రత.. అఫ్ఘాన్ నుంచి భారతీయుల తరలింపు?
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌లు పైచేయి సాధిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత పౌరులు, అధికారులను స్వదేశానికి తరలించే ప్రణాళికలు చేస్తున్నది. రాజధాని కాబుల్, కాందహర్, మజరీ షరీఫ్ నగరాల నుంచి వీరిని తరలించే ప్రణాళిక పూర్తయినట్టు ఓ అధికారి వెల్లడించారు. అఫ్ఘాన్‌లో భారత ఎంబసీ(కాబుల్) సహా నాలుగు కాన్సులేట్ కార్యాలయాలున్నాయి. ఈ దేశం నుంచి తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు ఏప్రిల్‌లో ప్రకటించడం, తాలిబన్‌లతో అంతర్జాతీయ శక్తుల మంతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాద సంస్థ పరిధి క్రమంగా పెరుగుతున్నది. అఫ్ఘన్ సైనికాధికారులు తాలిబన్‌లో కలుస్తున్న ఉదంతాలున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ అధీనంలోని ప్రాంతాల నుంచి తాలిబన్ దాడులు జరిగే ముప్పు ఉందన్న భయంతో అఫ్ఘాన్ అధికారులే తరలివెళ్లిపోతున్నారు. ఈ సందర్భంలోనే భారత ప్రభుత్వం పౌరుల తరలింపునకు ప్రణాళికలు చేస్తున్నది.