- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్నిస్ దిగ్గజం అక్తర్ అలీ మృతి
దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ దిగ్గజం, డేవీస్ కప్ టీమ్ ఇండియాకు చాలా ఏళ్లు కోచ్‌గా పని చేసిన అక్తర్ అలీ(83) ఆదివారం పలు రకాల అనారోగ్య సమస్యలతో కోల్‌కతాలో మృతి చెందారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఇటీవల ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. డేవీస్ కప్ ప్రస్తుత జట్టుకు కోచ్‌గా ఉన్న జీషన్ అలీ తండ్రే అక్తర్ అలీ. టెన్నిస్‌లో దూకుడుగా సర్వీస్ చేయడం, వాలీ గేమ్ ఆడటం వంటి వాటిల్లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. తన కొడుకు జీషన్ అలీతో పాటు లియాండర్ పేస్‌కు అక్తర్ అలీ వ్యక్తిగతంగా కోచింగ్ ఇచ్చారు. ఎంతో మంది టెన్నిస్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అక్తర్ పాత్ర ఉన్నది. అక్తర్ అలీ మరణ వార్తను తెలుసుకున్న విజయ్ అమృత్‌రాజ్ సంతాపం వ్యక్తం చేశారు. గతంలో అతడి పర్యవేక్షణలో తాను కోచింగ్ తీసుకున్న విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.