ఇటలీని దాటిన భారత్

by vinod kumar |
ఇటలీని దాటిన భారత్
X

న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో భారత్ ఇటలీని దాటేసింది. దేశంలో వరుసగా మూడు రోజుల నుంచి కొత్త కేసులు తొమ్మిది వేలకుపైగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,887 కేసులు నమోదయ్యాయని కేంద్రం శనివారం వెల్లడించింది. మొత్తం కేసులు 2,36,657లకు చేరాయి. దీంతో ఇటలీని దాటి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న ఆరో దేశంగా భారత్ అవతరించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశంగా అమెరికా(సుమారు 19 లక్షలు) తొలిస్థానంలో ఉన్నది. కానీ, కొత్త కేసుల నమోదులో భారత్.. అమెరికాకు దీటుగా వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ టాప్5 దేశాల్లోకి సులువుగా ప్రవేశించే ప్రమాదమున్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇటలీతో పోల్చితే కరోనా మరణాల విషయంలో మాత్రం భారత్ మెరుగ్గా ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed