- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువ
వాషింగ్టన్: అమెరికా తర్వాత అత్యధిక కరోనా టెస్టులు భారత్‌లోనే నిర్వహించారని వైట్‌హౌజ్ వెల్లడించింది. అమెరికా 4.2కోట్ల కరోనా టెస్టులు నిర్వహించగా, భారత్ 1.2కోట్ల పరీక్షలు జరిపిందని తెలిపింది. టెస్టుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉన్నదని వివరించింది. యూఎస్‌లో ఇప్పటి వరకు 35లక్షల మందికి కరోనా పాజిటివ్ తేలగా, 1.38లక్షల మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కెలీ మెక్ఎనాని విలేకరులతో మాట్లాడారు.
‘ప్రపంచంలో అత్యధిక టెస్టులు నిస్సందేహంగా మేమే నిర్వహించాం. 4.2 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాం. మా తర్వాత 1.2కోట్ల టెస్టులతో భారత్ ద్వితీయ స్థానంలో ఉన్నది. గత ఒబామా- బిడెన్ పాలనలో వైరస్‌లకు ఇంత మొత్తంలో టెస్టులు జరపలేదని హెచ్1ఎన్1 ఫ్లూ టెస్టుల పరీక్షలను ఆ ప్రభుత్వం అర్థంతరంగా నిలిపేయాలని ఆదేశించింది. కరోనా తీవ్రత అధికమని, పెద్దమొత్తంలో ప్రాణాలను బలిగొంటున్నదని, దానికి హెచ్1ఎన్1కు పోలికే లేదని బిడెన్ మాజీ సిబ్బంది చీఫ్ రాన్ క్లెయిన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికావు. ఆ వైరస్ కూడా అమెరికాలో విధ్వంసాన్నే సృష్టించింది. ప్రస్తుత ప్రెసిడెంట్ టెస్టుల్లోనూ, చికిత్స విధానాల కృషిలోనూ, వెంటిలేటర్లు పంపిణీ, వ్యాక్సిన్ అభివృద్ధిలోనూ ముందంజలో ఉన్నారు. మొడెర్నా సానుకూల ఫలితాలనిస్తున్నదని, ప్రస్తుతం అది మూడో దశ ట్రయల్స్ ప్రారంభించింద’ని చెప్పుకొచ్చారు.