ఆ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న భారత్.. ఎందుకో తెలుసా..?

by Anukaran |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు సంబందించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 42,640 కేసులు నమోదు అయ్యాయి. గత 91 రోజుల్లో కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ నిర్ధారణ అయినవారి సంఖ్య 2,99,77,861 చేరింది. నిన్న ఒక్కరోజే 1,167 మంది వైరస్‌తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,89,302కు పెరిగింది. సోమవారం ఒక్క రోజే 81,839 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,89,26,038 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో 6,62,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాక్సిన్ మొదలు నుంచి సోమవారం వరకు భారత్‌లో 28,87,66,201 మంది టీకా తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story