- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగుతున్నది. గురువారం 3 లక్షల మార్కును దాటిని కొవిడ్ కేసులు.. అదే ఉధృతిని కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,32,730 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం దేశంలో 3.17 లక్షల కేసులు నమోదైన విషయం విదితమే.
కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.62 కోట్లకు (1,62,63,695) చేరింది. మరణాలు 2 లక్షలకు చేరువలో (1,86,920) ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,28,616 కి పెరిగింది. ఇదిలాఉండగా, దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నాటికి దేశంలో 13,54,78,420 మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులలో.. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచే 54.15 శాతం కేసులున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 20.04 శాతం (67,013) కేసులుండటం గమనార్హం. మరణాలు మహారాష్ట్ర (568), ఢిల్లీ (306)లో అధికంగా ఉన్నాయి.