- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారంలో 50 వేల కేసులు.. ఏడో స్థానంలో భారత్
కరోనా పాజిటివ్ కేసుల్లో ఆదివారం నాటికి భారత్ ఏడో స్థానానికి చేరుకుంది. ఒక్క వారంలోనే 50 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో అప్పట్లో పదో స్థానంలో ఉన్న భారత్.. రీసెంట్‌గా ఏడో స్థానానికి చేరింది. మే 25వ తేదీన 1.38 లక్షల కేసులతో ఇరాన్‌ను దాటిన పదో స్థానానికి చేరుకోగా.. ఇప్పుడు దాదాపు 1.82 లక్షల కేసులకు చేరుకోవడం గమనార్హం.
ఇప్పటికీ 18 లక్షల కేసులతో అమెరికా మొదటిస్థానంలో ఉండగా, ఐదు లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో, నాలుగు లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో ఉన్నాయి. కాగా దేశ జనాభాతో పోలిస్తే భారత్‌లో కేసులు తక్కువే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారంలో రికవరీ రేటు కూడా 42 శాతం నుంచి 47 శాతానికి పెరిగింది. ఇతర దేశాలతో పోల్చితే కరోనా వ్యాప్తి కూడా భారతదేశంలో వేగవంతంగా లేకపోవడం ఒక శుభపరిణామమని ఆరోగ్య శాఖ సైతం ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఆదివారం ఒక్కరోజే ఇండియాలో ఇప్పటివరకు అత్యధికంగా 8,380 కేసులు నమోదయ్యాయి.