- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమమా?.. ఫైనలా?
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులకు మంచి కిక్కిచ్చే మ్యాచ్ రానే వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్‌లో గల ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్డేడియమైన నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టనుండటంతో.. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 2-1 ఆధిక్యంతో మంచి ఫామ్‌లో ఉండటంతో.. ఈ మూడో మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. చివరి టెస్టులో టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.
గత మ్యాచ్ జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరుగబోతోంది. ఈ సారి కూడా ఫిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మూడో టెస్టులో తన స్పిన్ మాయాజలంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టిన అక్షర్ పటేల్, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో మరోసారి తమ స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టే అవకాశముంది.
అక్షర్ పటేల్, అశ్విన్‌తో పాటు టీమిండియాకు అదనంగా మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. దీంతో బౌలింగ్‌లో టీమిండియాకు తిరుగులేదని చెప్పాలి. ఇక బ్యాట్స్‌మెన్ల విషయానికొస్తే.. రోహిత్ శర్మ గత రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని సమర్ధవంతంగా పరుగులు రాబట్టాడు. ఇక విరాట్ కోహ్లీ, పుజారా, రహనే లాంటి బ్యాట్స్‌మెన్లు ఎలాగూ ఉన్నారు. వీరిలో ఒకరిద్దరైనా భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. దీంతో బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ టీమిండియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే.. గత రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలవడంతో.. మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. అయితే ఫాస్ట్ బౌలర్లతో ఎక్కువగా ఇంగ్లండ్ నెట్టుకురావడం మైనస్‌గా మారింది. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఒక కెప్టెన్ రూట్ తప్పితే.. మిగతా బ్యాట్స్‌మెన్లు రాణించడం లేదు.
ఏది ఏమైనా ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ఇంగ్లండ్ రంగంలోకి దిగుతుండగా.. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టాలని కోహ్లీ సేన భావిస్తోంది.