- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెల్ఫ్ క్వారంటైన్?
దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ సెల్ఫ్ క్వారంటైన్ కానున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్రపతి భవన్ వర్గాలు. కరోనా బాధితురాలు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇచ్చిన పార్టీకి హాజరైన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ ఆ తర్వాత రోజు రాష్ట్రపతితో భేటి అయ్యారు. విషయం తెలుసుకున్న రామ్‌నాథ్ కోవింద్ వెంటనే అలర్ట్ అయ్యారు. తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.ఈ క్రమంలోనే సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనంతటికి కారణమైన సింగర్ కనికా కపూర్ పై యూపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లకుండా పార్టీలు ఇవ్వడం ఎంటనీ ప్రశ్నించింది. వివరాల్లోకి వెళితే..ఈనెల 15న సింగర్ కనికా యూకేకు వెళ్లి యూపీకి తిరిగొచ్చింది. ఆ తర్వాత లక్నోలోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో ప్రముఖులకు విందు ఇచ్చింది. మరుసటి రోజు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీంతో విందుకు వచ్చిన ఆహ్వానితులందరూ షాక్ తిన్నారు. విషయం కాస్త సీఎం యోగి ఆదిత్యనాధ్‌కు తెలియడంతో లక్నో అంతటా అలర్ట్ ప్రకటించారు. ఆమెను కలిసిన వారి వివరాలు సేకరించి వారందరికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఇక విదేశీ పర్యటనకు వెళ్లొచ్చాక పరీక్షలు చేయించుకోకుండా అలసత్వం వహించిన ఆమెపై చర్యలకు ప్రభుత్వం ఉపకరించింది. ఇక మీదట ఎవరైనా విదేశాలకు వెళ్లినా, వచ్చినా తమ వ్యక్తిగత వివరాలను ప్రభుత్వానికి అందించాలన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.ఇదిలా ఉండగా కనికా ఏర్పాటు చేసిన విందుకు రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, పలువురు ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. పార్టీకి హాజరైన వారితో కనికా సెల్ఫీలు తీసుకున్నారు. షేక్ హ్యాండ్‌లు ఇచ్చారు. పార్టీకి హాజరైన మరుసటి రోజు ఎంపీ దుష్యంత్ సింగ్ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎంపీ నిశికాంత్, మనోజ్ తివారీతో భేటీ అయ్యి ముచ్చటించారు. ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. కనికాకు పాజిటివ్ అని తేలడంతో ఎంపీ దుష్యంత్ సింగ్, వసుంధరా రాజే ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లోకి వెళ్లిపోయారు. ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై ఆ రోజు పార్టీకి హాజరైన వారందరూ స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని, ఏవైనా కరోనా లక్షణాలుంటే తమకు తెలియపరచాలని సూచించారు.
tags ; india president ram nath kovind, bollywood singer kanika kapoor,dushyant singh, vasundhara raje