టీమిండియా ఆ పని చేస్తేనే సెమీస్‌కు అవకాశం.. బ్రెట్ లీ కీలక సూచన

by Shyam |
టీమిండియా ఆ పని చేస్తేనే సెమీస్‌కు అవకాశం.. బ్రెట్ లీ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయినా.. సెమీస్‌కు చేరే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌ లీ అంచనా వేశాడు. ఇక నుంచి భారత్ పూర్తి సామర్థ్యాలతో రాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఇప్పటికైనా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేసేందుకు సిద్ధం కావాలని సూచించాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయకపోతే భారత్ వేరే ఆప్షన్ చూసుకోవాలని సూచించాడు. ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ తన మునుపటి పేస్ రాబట్టాలని పేర్కొన్నాడు. టీమిండియా బౌలింగ్‌తో టోర్నీలో తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయగలిగితే భారత జట్టు పటిష్టంగా మారినట్టే. హార్దిక్ పాండ్యాకు మంచి నైపుణ్యం ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. డెత్‌ ఓవర్లలో చాలా బాగా బౌలింగ్‌ చేయగలడు. బౌన్సర్లు, యార్కర్లు, పేస్‌లో మార్పులు చూపించగలడు. అందుకే టీమిండియాకు హార్ధిక్ అదనపు బలం అని బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed