- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2022 కల్లా భారత్ ‘స్వయం సమృద్ధి’: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత్ స్వయం సమృద్ధిని సాధించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలో విభజన, విద్వేషాలను సృష్టించే శక్తులను భారతీయులందరూ ముఖ్యంగా యువత ఓడించాలని, దేశం మరింత పురోభివద్ధి సాధించడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా మెలగాలని వివరించారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం ఎంతో దూరంలో లేదని, అప్పటి వరకు ఏ లక్ష్యాలను సాధించాలో ఒకసారి అందరూ పరిశీలన చేసుకోవాలని తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. 2022కల్లా దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రతిఒక్కరూ స్వీయ ఆలోచన చేయాలని తెలిపారు. 2022నాటికి భారత్ తప్పకుండా స్వయం సమృద్ధిని సాధించాలని పేర్కొన్నారు.
పేదరికాన్ని తొలగించడానికి, అసమానతలు, సామాజిక, లింగ వివక్షను నిర్మూలించడానికి, అవినీతిని పారదోలడానికి అందరూ నడుంబిగించాలని సూచించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరమని, సాహిత్యంలో కొత్తపూవులు పూయాలని, దేశ భాషల్లోని కళాత్మక వ్యక్తీకరణ మరోసారి ముందుకురావాల్సిన తరుణం ఇదేనని వివరించారు.