- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య ఉత్పత్తులపై పన్ను పోటు!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడందరూ కరోనా వైరస్ ఎన్ని దేశాలకు వ్యాపించింది. ఎంతమందికి సోకింది.. ఏ ఏ దేశాలు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నాయి.. మన దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. లాక్‌డౌన్ ఎలా ఉంది.. తర్వాత పరిస్థితి ఏంటి లాంటి విషయాలను ప్రజలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాం.. ఎలాంటి లోపాలున్నాయి.. అనే అంశాలు ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి. అందులో భాగంగా వ్యాధి వ్యాప్తిని అరికడుతూ వైద్యానికి సంబంధించిన పరికరాలు, వాటి దిగుమతి, వాటిపై పన్ను విధానం ఎలా ఉందో తెలుసుకుందాం. మిగిలిన దేశాలకంటే మన దేశంలోనే వైద్య పరికరాలు, ఉత్పత్తులపై పన్ను అధికంగా ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ నివేదిక చెబుతోంది.
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లోని సభ్య దేశాలు విధించే సగటు పన్ను కంటే మనదేశంలో వైద్యానికి సంబంధించిన ఉత్పత్తులపై దిగుమతుల కోసం అధిక పన్నులను విధిస్తున్నారు. ఏప్రిల్ 3న డబ్ల్యూటీవో కరోనా నేపథ్యంలో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
వైద్య ఉత్పత్తుల కోసం డబ్ల్యూటీవోలోని అన్ని సభ్య దేశాల సగటు పన్ను 4.8 శాతం ఉండగా, ఇండియాలో మాత్రం 11.6 శాతం ఉంది. మరింత స్పష్టంగా గమనిస్తే.. ఔషధాలపై డబ్ల్యూటీవో పన్ను సగటున 2.1 శాతం ఉంటే ఇండియాలో 10 శాతం ఉంది. వైద్య సామగ్రిపై డబ్ల్యూటీవో పన్ను సగటున 6.2 శాతం ఉండగా, ఇండియాలో వాటిపై 15 శాతం పన్ను విధిస్తున్నారు. వైద్య పరికరాలపై డబ్ల్యూటీవో సభ్య దేశాల సగటు పన్ను 3.5 శాతం ఉంటే, ఇండియాలో మాత్రం 9 శాతం ఉండటం గమనార్హం. వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులపై డబ్ల్యూటీవో సగటు పన్ను 11.5 శాతం ఉండగా, ఇండియాలో స్వల్ప తేడాతో 12 శాతం మాత్రమే ఉంది.
కరోనా సంక్షోభ సమయంలో తీవ్రమైన కొరత ఉన్న వాణిజ్య ఉత్పత్తుల మొత్తం విలువ రూ. 44 లక్షల కోట్లని, ఇది 2019లో మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 1.7 శాతం అని నివేదిక పేర్కొంది. ఈ ఉత్పత్తుల్లో శానిటైజర్లు, సబ్బులు, రోగి కోసం ఏర్పాటు చేసిన మానిటర్లు, ప్రొటెక్టివ్ గ్లాస్, ఫేస్‌మాస్కులు, సిరంజీలు, థర్మామీటర్లు, ఆల్ట్రాసోనిక్ స్కానింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ మాస్కులు, ఎక్స్‌రే పరికరాలు, స్టెరిలైజర్లు మొదలైనవి ఉన్నాయి.
దేశీయంగా వైద్య ఉత్పత్తుల దిగుమతులు, ఎగుమతుల మొత్తం విలువ సుమారు 2 ట్రిలియన్ డాలర్లు. ఇది 2019లో మొత్తం ప్రపంచ వాణిజ్యంలో సుమారు 5 శాతానికి సమానమని నివేదిక తెలిపింది. డబ్ల్యూటీవో వివరాల ప్రకారం.. గత మూడేళ్లలో యూఎస్ అత్యధికంగా వైద్య ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది 2019లో మొత్తం ప్రపంచ దేశాల దిగుమతుల్లో 19 శాతం. రెండోస్థానంలో 9 శాతం వాటాతో జర్మనీ ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా, బెల్జీయం సమానంగా 6 శాతం కలిగి ఉన్నాయి. వైద్య ఉత్పత్తుల దిగుమతుల్లో తొలి పది స్థానాల్లో మిగిలిన దేశాలు నెదర్లాండ్స్, జపాన్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ ఉన్నాయి. 2019లో యూఎస్, జర్మనీ దేశాలు సంయుక్తంగా 22 శాతం వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయి. వ్యక్తిగత రక్షణ ఉత్పత్తుల్లో సబ్బులు, శానిటైజర్లు, ఫేస్‌మాస్కులు, ప్రొటెక్టివ్ గ్లాస్ ఉంటాయి. ఇందులో సుమారు 17 శాతం ఉత్పత్తులను చైనాయే ఎగుమతి చేస్తుంది.
డబ్ల్యూటీవో సాధారణంగా వైద్య వస్తువుల వాణిజ్యం, వాటిపై విధించే పన్నులకు సంబంధించి సమగ్రమైన నివేదికను ఇచ్చింది. వీటిలో చాలావరకు ప్రస్తుత సంక్షోభం కారణంగా తీవ్రమైన కొరత ఉన్నట్లు నివేదిక చెబుతోంది.
Tags: Tariffs For Medical Product Imports, World Trade Organisation, COVID-19 Pandemic, COVID-19 Medical Equipments, Face Masks, Face Masks Exports