- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈక్విటీ మార్కెట్ల నుంచి 7 బిలియన్ డాలర్లు సేకరించిన దేశీయ కంపెనీలు
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ కంపెనీలు ఈక్విటీ మార్కెట్ల నుంచి 7.3 బిలియన్ డాలర్ల(రూ. 53.5 వేల కోట్లు)ను సమీకరించాయి. ఇది 2018 మొదటి త్రైమాసికం తర్వాత అత్యధిక మూలధన సేకరణ అని, ఈ మూలధనం గతేడాది కంటే 13.4 శాతం కంటే అధికంగా నమోదైనట్టు ప్రముఖ మార్కెటింగ్ డాటా సంస్థ రెఫినిటివ్ తెలిపింది. రికార్డు స్థాయిలో విదేశీ నిధులు వచ్చి చేరడం, ఆర్థిక పునరుద్ధరణపై సానుకూల పరిణామాలతో దేశీయ ఈక్విటీ సూచీల నుంచి మూలధన సేకరణ పెరిగింది.
సమీక్షించిన త్రైమాసికంలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా సేకరించిన నిధులు 99 శాతం పెరిగి 2.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిఫినిటివ్ నివేదిక తెలిపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి 41.6 శాతం వాటాతో మూలధన సేకరణలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు ఆధిపత్యం సాధించాయి. కరోనా కారణంగా బ్యాడ్ లోన్స్ పెరుగుతాయనే ఆర్‌బీఐ అంచనాల నేపథ్యంలో ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీల నుంచి వేగవంతమైన నిధుల సేకరణ జరిగిందని నివేదిక అభిప్రాయపడింది.