- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్‌పోర్ట్‌లో ‘స్మార్ట్ ట్రాలీస్’
దిశ, వెబ్‌డెస్క్ : విదేశీ ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఐఓటీతో అనుసంధానించిన స్మార్ట్ బ్యాగేజ్ ట్రాలీ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇండియాలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా ప్రయాణికుల లగేజ్ తరలింపునకు సంబంధించి బ్యాగేజ్ ట్రాలీలు అందుబాటులో ఉన్నాయో? లేవో? తెలుసుకోవచ్చు.
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 3,000 బ్యాగేజ్ ట్రాలీలను ఐఓటీ టెక్నాలజీతో ఇప్పటికే అనుసంధానించారు. దీంతో బ్యాగేజ్ ట్రాలీస్ కోసం వెయిటింగ్ టైమ్ తగ్గుతుంది. తద్వారా ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని సేవ్ చేసుకునే వీలుంది. కాగా నూతన టెక్నాలజీ ఆవిష్కరణలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వేదికగా నిలుస్తోందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్.జి.కె.కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు. మున్ముందు ఈ ప్రాజెక్టును మరింతగా విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.