చిరిగిన జాతీయ జెండాను మార్చరూ..!!

by Anukaran |   ( Updated:2021-04-15 05:56:16.0  )
చిరిగిన జాతీయ జెండాను మార్చరూ..!!
X

దిశ, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ మిని ట్యాంక్ బండ్ వద్ద గత ఆగస్ట్ 15న అతిపెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన జాతీయ జెండా తర్వాత ఇదే అతి పెద్ద జాతీయ జెండా. ఈ జెండా ఎత్తైన ప్రదేశంలో ఉండగా.. వర్షానికి నానుతూ.. ఎండకు ఎండుతూ.. బాగా గాలి వీచడ౦తో.. చిరిగిపోయింది. చిరిగిన జాతీయ పతాకాన్ని మార్చి.. వేరేది ఎక్కించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story