భారత్, ఇంగ్లాండ్‌ల సిరీస్ వాయిదా

by Shyam |
భారత్, ఇంగ్లాండ్‌ల సిరీస్ వాయిదా
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే అనేక టోర్నీలు వాయిదా పడ్డాయి. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కూడా వాయిదా పడింది. కొవిడ్ ముప్పు కొనసాగుతుండటంతో ఈ సిరీస్‌ను 2021కి వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది టెస్టు సిరీస్ తర్వాత నిర్వహించనున్న ఈ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్‌లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.

Advertisement

Next Story