అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశం ధోనీకి లేదు: ఆకాశ్ చోప్రా

by Shyam |
అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశం ధోనీకి లేదు: ఆకాశ్ చోప్రా
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ కప్(ICC World Cup) తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టని ఎంఎస్ ధోని(MS Dhoni) త్వరలో ఐపీఎల్‌(IPL)లో ఆడనున్నాడు. ఐపీఎల్‌లో సత్తా చాటడం ద్వారా టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup) జట్టులో స్థానం సంపాదించుకుంటాడని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే, ధోనికి అసలు అంతర్జాతీయ క్రికెట్(International cricket) ఆడాలని లేదని వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా (Commentator Akash Chopra) అంటున్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ ఆడితే టీం ఇండియా(Team India) విజయావకాశాలు మెరుగు పడతాయా అని ఒక అభిమాని చోప్రాను ప్రశ్నించాడు. దీనికి చోప్రా సమాధానమిస్తూ.. ‘ధోనీ లేకుండా కూడా భారత్ రాణించగలదు. ఆ టోర్నీ ఇండియాలో జరుగుతుంది కాబట్టి మనందరం ధోనీ ఉండాలని అనుకుంటాం. కానీ అసలు ధోనీకి ఆడాలని ఉందా లేదా అనేది ముఖ్యం. అతనికి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని లేదు. ఈ విషయం ఎన్నో సార్లు నేను చెప్పాను’ అని చోప్రా అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story