- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసులకు మెడల్స్ అందజేసిన నిరంజన్‌రెడ్డి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే నారాయణపేట జిల్లాలో రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు మెడల్స్ అందజేశారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వారు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బియ్యంతో పాటు ప్రతినెలా రూ. 1500 నగదు చెల్లించి అండగా నిలిచిందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న సేవలను వారు ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.