శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

by Sridhar Babu |
శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
X

దిశ, రాజేంద్రనగర్ : భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నేడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణికర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీఐజీ & చీఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆఫీస్ ఎంకే.సింగ్, సీఐఎస్ఎఫ్, రక్ష సెక్యూరిటీ పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సీఐఎస్ఎఫ్ బృందం ఎమర్జెన్సీ రెస్క్యూ అండ్ ప్రొటెక్షన్ డ్రిల్‌ను ప్రదర్శించింది. సీఐఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ నైపుణ్యాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కొవిడ్ మహమ్మారి మధ్య విమానాశ్రయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత జాగ్రత్తలతో జరుపుకున్నారు. కార్యక్రమం అంతటా సామాజిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

Next Story