- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
48 గంటల పాటు SBI బ్యాంకు ఉద్యోగుల సమ్మె
దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు నలభై ఎనిమిది గంటల సమ్మెలో భాగంగా బ్యాంకు ముందు నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 9 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు గురువారం, శుక్రవారం 16,17 తేదీల్లో 48 గంటలపాటు నిరవధికంగా చేపట్టిన దేశవ్యాప్త జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో బ్యాంకు ఉద్యోగలు, కార్మికులు సమ్మె చేపట్టి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు ఖాతాదారులు కలిగిన 22,219 బ్రాంచిలో 51 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన, 66 సంవత్సరాల సువర్ణ చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు లను కంపెనీని భాగస్వామిగా చేరుస్తూ ఒప్పందం చేయడం అన్యాయమన్నారు.
యుఎఫ్బియు ఏరియా కార్యదర్శి నర్సిములు మాట్లాడుతూ.. 28 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను విలీనం పేరుతో 12 బ్యాంకులుగా కుదించిందని..దేశంలో వేలాది శాఖలను మూసివేసి దేశ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను దూరం చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతో పార్లమెంటులో చట్టాలు సవరించడానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని నర్సిములు అన్నారు. అంటే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి చేరే ప్రమాదం ఏర్పడుతుందని ఆయనన్నారు. ఈ సమ్మెలో తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు16,17 తేదీల్లో బ్యాంక్‌ల జాతీయ సమ్మెలో పాల్గొని జయ ప్రదం చేయాలని ఆయనకోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది , యుఎఫ్బియు, ఎఐ బిఇఎ యూనియన్ నాయకులు అనిల్ కుమార్.సంజీవ మెహర్,ప్రదీప్ మెహర్, ఎస్బిఐ సిబ్బంది పవన్, వెంకటేష్, నవీన్, జీవన్, రాము, బషీర్, నరసింహులు, సదాశివ, అనిల్, పాల్గొన్నారు.