ఆర్టీసీ బస్టాండ్‌లో అవస్థలు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

by Aamani |
ఆర్టీసీ బస్టాండ్‌లో అవస్థలు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
X

దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి బస్టాండ్ ఆవరణలో భారీవర్షాలు కురవడంతో నీరు నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా వుండే బస్టాండ్ ఆవరణలో నీరు నిలవడం పట్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. బస్టాండ్ అధికార సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క బస్టాండ్ ఆవరణంలోని ముందర భాగంలో పెద్ద మొత్తంలో నీరునిలువడంతో ఆ కాలనీవాసులు, షాప్ నిర్వాహకులు, దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు మార్కేట్ అక్కడే నిర్వహిస్తుంటారు. మార్కేట్ సంతకు వచ్చేవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా బస్టాండ్ అధికార సిబ్బంది స్పందించి ప్రయాణికుల, ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed