APలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

by srinivas |
congress
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీలు సిడి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, జెడీ శీలం, చింతా మోహన్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాజీ కేంద్ర మంత్రి డా.చింతా మోహన్ మాట్లాడుతూ… దేశంలోని ప్రజల సొమ్మంతా కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు పంచిపెడుతుందని మండిపడ్డారు. దేశ అభివృద్ధి అరుంధతి నక్షత్రం మాదిరిలా మారిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో సంక్రాంతిలోపు 80 లక్షల మంది విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో మాజీ కేంద్రమంత్రి జే.డీ శీలం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రెండున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో మొత్తం మోసాలు, అవినీతి కనపడుతుందని ధ్వజమెత్తారు. పన్నులు విధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ విషయాన్ని ఇదే అదునుగా భావించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed