ఇందుకోసమే ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి: మంత్రి సబితా

by Sridhar Babu |   ( Updated:2021-12-15 03:20:56.0  )
Minister-sabitha1
X

దిశ, కూకట్​పల్లి: ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గ పరిధిలోని కూకట్​పల్లి ప్రభుత్వ జూనియర్​కళాశాలలో బుధవారం అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సి కుర్మయ్యగారి నవీన్​ కుమార్​లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దీంతో ఈ వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో అందిస్తున్న బోధనతో అడ్మిషన్లు పెరగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాత్ర ఎంతో ఉందని అన్నారు.

Minister-Sabitha-2

అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ వేలాది మంది నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదే విధంగా విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అదే విధంగా కళాశాలలో మౌలిక వసతులు కల్పించడానికి తన సొంత నిధులు రూ. పది లక్షలు వెచ్చించి కళాశాలలో బెంచిలు అందించినట్లు ఆయన చెప్పారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

అనంతరం ఐఐటీతోపాటు ఇతర పరీక్షలల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మనస్వి, నాయక్​లను అభినందిస్తూ వారి తల్లి తండ్రులకు మంత్రుల చేతుల మీదుగా ల్యాప్​టాప్​లను బహుకరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు పగుడాల శిరీష బాబురావు, ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీష్ గౌడ్, మహేశ్వరి శ్రీహరి, సబిహ బేగం, మందడి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ రూప దేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed